Saturday, June 29, 2024

AP | అచ్చెన్నాయుడుకి మాతృ వియోగం

కోటబొమ్మాళి, మార్చి31,(ప్రభ న్యూస్):తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు మాతృవియోగమైంది. అతని తల్లి కళావతమ్మ (90) వృద్ధాప్య కారణంగా ఆదివారం తన నివాసం నిమ్మడలో మృతి చెందారు. ఈమె భర్త దాలినాయుడు ఇదివరకే కొన్నేళ్ల క్రితం మృతి చెందారు.

కళావతమ్మకు ఏడుగురు సంతానం. ఇందులో పెద్ద కుమారుడైన దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రెండో కుమారుడు పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు హరి వరప్రసాద్ కాగా మూడో కుమారుడు డి.ఎస్.పి ప్రభాకర్ రావు, చిన్న కుమారుడు ప్రస్తుతం టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు. వీరి తో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

శ్రీకాకుళం సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కళావతమ్మ స్వయాన నాన్నమ్మ. కళావతమ్మ మృతితో నిమ్మాడ గ్రామం శోకసంద్రమయింది. ఆమె మృతికి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement