Monday, November 25, 2024

ANU: ఘ‌నంగా అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు

గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ నృత్య దినోత్సవ వేడుకలు, పుస్తక ఆవిష్కరణ అత్యంత ఘనంగా నిర్వ‌హించారు. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్కూల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో భాగమైన నృత్య విభాగం, ఒక ముఖ్యమైన పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని సగర్వంగా నిర్వహించింది. “కరణాలు – ది యూనిట్స్ ఆఫ్ డ్యాన్స్” అనే పుస్తకాన్ని రచించారు.

డా.శృతకీర్తి హెచ్ ఓడీ నృత్య విభాగం. వైస్ ఛాన్సలర్ అయిన ఆంగ్ల సాహిత్య మహా పండితులు పట్టేటి రాజశేఖర్ ఈ గ్రంథాన్ని విడుదల చేసారు. ప్రముఖ సంస్కృత భాషా పండితులు, రెక్టార్ వర ప్రసాద్ మూర్తి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సిద్ధయ్య, బౌద్ధ అధ్యయనాల విభాగాధిపతి ఉదయ్ కుమార్‌తో సహా ఇతర ప్రముఖ విద్యావేత్తలకు మొదటి కాపీలను అధికారికంగా అందజేశారు. ఈ ప్ర‌య‌త్నాన్ని వైస్ ఛాన్సలర్ మెచ్చుకున్నారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని డిపార్ట్‌మెంట్‌ని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం విశ్వవిద్యాలయం సాంస్కృతిక వైశిష్ట్యానికి ఉదాహరణగా నిలిచింద‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement