పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్ధల అధినేత నారాయణను అరెస్టు చేయడాన్ని టీడీపీ ఖండించింది. ప్రభుత్వం తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే ఆయన్ను అరెస్ట్ చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. జగన్ తన అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడేళ్ల పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి.. టీడీపీ నేతలను అక్రమ అరెస్ట్ లు, అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎలాంటి నోటీసులు లేకుండా నారాయణ పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement