Friday, November 22, 2024

రైతు భరోసాలో అంకెల గారఢీ: ఏపీ సర్కార్ పై అచ్చెన్న ఫైర్

వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ సున్నావడ్డీ, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకాలకు సంబంధించి రూ.2,190 కోట్లను ఏపీ ప్రభుత్వం మంగళవారం రైతులు, రైతు గ్రూపుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే,దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. రైతు భరోసాలో అంకెల గారఢీతో అన్నదాతలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా పేరుతో ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేశారో ప్రజలకు చెప్పే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. రైతు భరోసా కేవలం రూ.30 కోట్లు మాత్రమే అని కింద విడుదల చేశారన్న అచ్చెన్న… రూ.1213 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పడం రైతులను మోసం చేయడమే అని పేర్కొన్నారు. ప్రజలను తప్పదారి పట్టిస్తున్న సీఎం జగన్.. రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకేదఫాలో రూ.12,500 ఇస్తామని హామి ఇచ్చి 3 దఫాల్లో రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.30 వేలు నష్టపోతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.

ఇది కూడా చదవండి: అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌ ఈటల: మోత్కుపల్లి

Advertisement

తాజా వార్తలు

Advertisement