ఏపీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజల ప్రాణాలకంటే కక్ష సాధింపు చర్యలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. వ్యాక్సినేషన్‌లో ఏపీ వెనకబడిందన్న అచ్చెన్నా.. ఇతర రాష్ట్రాలు కరోనా కట్టడిలో ముందుంటే.. సీఎం జగన్ కక్షసాధింపు చర్యల్లో ముందుందని మండిపడ్డారు. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవన్నారు. వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని రాష్ట్రంలోనే ఉన్నారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చేసే మొక్కుబడి సమీక్షలతో ప్రజలకు ఏం ప్రయోజనం ? అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
కాగా, ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరుకుంది. సౌత్ ఆఫ్రికా నుండి హైదరాబాద్ మీదుగా ఒంగోలు వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే, యుకె నుండి బెంగళూరు మీదుగా అనంతపురం వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ ఉన్నట్లు తేలింది. జీనోమ్ సీక్వెన్స్ పరీక్షల ద్వారా ఒమిక్రాన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..