కర్నూలు బ్యూరో : అన్నం పెట్టిన సంస్థకే ఇద్దరు కన్నం పెట్టారు. అక్రమ మార్గంలో కోట్లు మళ్ళించారు. ఆలస్యంగా గుర్తించిన సంస్థ యాజమాన్యం ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిన ఘటన కర్నూల్ నగర పరిధిలో చోటుచేసుకుంది.
కర్నూలు నగరంకు చెందిన హరికృష్ణ, మునిస్వామిలు అబ్బ బజాజ్ షోరూమ్ లో పనిచేస్తున్నారు. అయితే వీరు తమ షోరూమ్ లోని స్పే ర్ పార్ట్స్ అమ్ముకొని ఆ నగదు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. కంపెనీ ఆడిట్ లో భాగంగా లెక్కల్లో తేడాలు వచ్చాయి. దీంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు తామే నేరం చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు. గత నాలుగేళ్లుగా రూ.2.36కోట్ల నగదును కాజేశారని గుర్తించినట్లు వెల్లడించారు.
- Advertisement -