పత్తికొండ, (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని హోసూరు గ్రామంలో హత్యకు గురైన వాకిటి శ్రీనివాసులు హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితులను అరెస్టు చేసిన అనంతరం ఆదివారం పత్తికొండ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాస ఆచారి ఆధ్వర్యంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
కేసు దర్యాప్తులో గ్రామంలో ఆధిపత్యం కోసమే వాకిటి శ్రీనివాస్‌ను హత్య చేసినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. 10 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా గుర్చించినట్లుగా వెల్లడించారు. కాగా, ఈ కేసులో ప్రధాన కుట్రదారులైన గుడిసె నరసింహులు, బోయ రామాంజనేయులు, ఉలినేని హరికృష్ణ, వడ్డె నరసింహులును అరెస్టు చేశారు.
హత్యకు పాల్పడిన బాలనేరస్థులు వడ్డె కాశీనాథ్, ఎరుకల వంశీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మోటార్ సైకిల్, ఇనుప రాడ్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తామని ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాస ఆచారి తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన వారిలో దేవనకొండ సీఐ శ్రీనివాసులు, పత్తికొండ ఎస్సై వెంకటేశ్వర్లు, ఏఎస్సై హేమ్లా నాయక్, సిబ్బంది ఉన్నారు.