Saturday, January 4, 2025

Accident – కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం – రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ..

కడప – కొత్త సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం గండికోటకు వెళుతుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఎస్ వి యు వాహనం బోల్తా పడింది. ఈ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వాహనంలో మొత్తం 7 మంది ఉన్నట్లు సమాచారం.. జమ్మలమడుగు మండలం చిటిమిటి చింతల గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

సింహాద్రిపురం మండలానికి చెందిన ఏడుగురు యువకులు న్యూ ఇయర్ వేడుకలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. చిటిమిటి చింతల సమీపంలో వాహనం కల్వర్ట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మరో నలుగురిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement