ఆంధ్ర ప్రభ స్నార్ట్ – : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువ వైద్యురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన జెట్టి హారిక పశువైద్యురాలు.
హారిక తండ్రి దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణి. హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్ళింది. . ఆదివారం ఉదయం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు
మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకొని హారిక మృతదేహాన్ని తెనాలికి వచ్చేందుకు సహకరించాలని విన్నవించుకుంటున్నారు. హారిక మరణ వార్త విని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలతో సంప్రదిస్తున్నారు.