కాకినాడ జిల్లా లో నేటి ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. దింతో స్పాట్ లోనే ఇద్దరు మృతి మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
అటు ఈ ప్రమాదంలో కారు… నుజ్జు నుజ్జు అయింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణిస్తున్నారు. భీమవరం నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.