కర్నూల్ బ్యూరో – కర్నూలు జిల్లా, కోడుమూరు మండలం ,కొత్తూరు సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును బైక్ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్య, భర్తలు మృతి చెందారు.
కోడుమూరుకు చెందిన బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి గోవింద్, ఆయన భార్య తో కలిసి కర్నూలు నుంచి కోడుమూరు వస్తుండగా ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎమ్మిగనూరు నుంచి నంద్యాలకు వెళ్తున్న ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. ఈ ఘటనలో భార్యాభర్తలు ఇరువురు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి.