బాపట్ల జిల్లా చిన్నాగంజం నుండి హైదరాబాదుకు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు చిలకలూరిపేట మండలం ఈవూరి వారి పాలెం డొంక సమీపంలో ఒక టిప్పర్ ను ఢీకొనడంతో బస్సు – టిప్పర్ లో అక్కడికక్కడే మంటలు వ్యాపించి రెండు వాహనాలు పూర్తిగా దహనం అయ్యాయి. ఆ సమయంలో బస్సులో మొత్తం 42మంది ఉన్నట్లు క్షతగాత్రులు తెలిపారు. వీరిలో టిప్పర్ డ్రైవర్, ట్రావెల్ బస్ డ్రైవర్ కాక మరో నలుగురు బస్సులోని ప్రయాణికులు మరణించినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం. వీరంతా బాపట్ల జిల్లా చిన్నగంజమ్ మండలం నీలాయిపాలెం వాసులుగా చెబుతున్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకొని హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు వివరించారు.
మృతుల వివరాలు:-
- Advertisement -
- అంజి (35) డ్రైవర్, చీరాల, బాపట్ల జిల్లా.
- ఉప్పుగుండూరు కాశీ (65), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
- ఉప్పుగుండూరు లక్ష్మి (55), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
- ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ (8), నీలాయిపాలెం గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
- హరి సింగ్ (39) టిప్పర్ డైవర్ ఉత్తరప్రదేశ్.
- దావులూరి శ్రీనివాసరావు(53) s/o సుబ్బారావు గోనసపుడి గ్రామం, చిన్నగంజాం మండలం, బాపట్ల జిల్లా.
మరో ఇద్దరి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో మరో 32మందికి గాయాలు కావటంతో వారిని చిలకలూరిపేట పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు.