Monday, November 11, 2024

Breaking: టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామాను ఎట్టకేలకు అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఈనెల 22న ఆమోదించినట్టు అసెంబ్లీ సెక్రెటరీ మంగళవారం తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ 2021, ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా సమర్పించారు.

అయితే స్పీకర్‌ ఫార్మేట్‌లో రాజీనామా ఇవ్వలేదని అధికార వైసీపీ నాయకులు ఆరోపించడంతో ఆయన మరోసారి రిజైన్ లెటర్ ఇచ్చారు. 2021, ఫిబ్రవరి 12న కూర్మనపాలెం గేట్‌ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్ష సందర్భంగా మీడియా సమక్షంలో రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్‌కు అందజేయవల్సిందిగా జర్నలిస్టులను కోరారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్‌కు విన్నవించారు. అయితే స్పీకర్ గంటా రాజీనామాను ఆమోదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement