Tuesday, November 26, 2024

రాజీనామాను ఆమోదించండి.. స్టీల్‌ ప్లాంట్‌కు పరిరక్షణకు దోహదపడతుంది: గంటా లేఖ

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ : విశాఖ ఉక్కు పరిరక్షణకు తన రాజీనామా లేఖ అవసరం ఎంతో ఉందని, ఆమోదించి స్టీల్‌ పరిరక్షణకు సహకరించాలని మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గం ఎంఎల్‌ఎ గంటా శ్రీనివాసరావు స్పీకర్‌కు రాసిన లేఖలో కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ తన శాసన సభ సభ్యత్వానికి ఫిబ్రవరి 12, 2021న ఏక వాక్యంతో గౌరవ స్పీకర్‌ ఫార్మేట్‌లోనే రాజీనామా చేసానన్నారు. దీనిని ఆమోదింపజేసుకునేందుకు నేను వ్యక్తిగతంగా కూడా మిమ్మల్ని కలిసి అభ్యర్ధించానని సోమవారం వెలువరించిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఏడాది దాటినా నా రాజీనామా ఇంకా ఆమోదానికి నోచుకోలేదని లేఖలో పేర్కొంటూ ఆయన ఏడాదికి పైగా కార్మిక సంఘాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్రప్రభుత్వం కానీ, విషయాన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం నాకు ఆవేదన కలిగించిందన్నారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడు పెంచి ప్లాంట్‌ మొత్తం విలువని లెక్కించేందుకు కన్సల్టెన్సీ నియామకానికి ఈ నెల 11వ తేదీ నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. ఇది విస్తృత ప్రయోజనాలు ఆశించి నిస్వార్ధంగా 22 వేల ఎకరాలు అందించిన నిర్వాసిత కుటుంబ త్యాగాలతో ప ఆటూ తమ జీవితాల్ని ఫనంగా పెట్టి పోరాటం చేస్తున్న కార్మికులు తెలుగువారి సెంటిమెంట్‌ని మరో సారి అపహాస్యం చేసినట్లుగా వెళ్లడించారు. ఈ పరిస్థితుల్లో తన రాజీనామాను ఆమోదించాలని ఆయన కోరారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. నిర్వాసిత కార్మిక సోదరులకు నై తికంగా మద్దతు ఇచ్చేందుక రాజీనామా ఉపయోగపడుతుందని ఆయన ఆశించారు. సామాజిక హోదా, గుర్తింపు, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన విశాఖ కోసం నా పదవీ త్యాగం చాలా చిన్నదని ఈ సందర్భంగా గంట శ్రీనివాసరావు స్పష్టం చేశారు. అంతకు మించి ఎలాంటి త్యాగానికైనా సిద్దపడ్డ నా ఆవేదనను సానుకూలంగా అర్ధం చేసుకోవాలని కోరారు. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణకై తన శాసన సభ సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆమోదించాలని లేఖలో గంటా శ్రీనివాసరావు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement