ఏపీ తెలంగాణ సరిహద్దుల్లోని చెక్పోస్ట్ వద్ద అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్న పక్కా సమాచారం మేరకు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శేఖర్ వాహనదారుల నుండి అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచార నేపథ్యంలో జగ్గయ్యపేట సమీపంలో ఉన్న గరికపాడు చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అదనపు ఎస్పీ మహేంద్ర ఆధ్వర్యంలోని అధికారులు ఈ దాడులు నిర్వహించారు.
గురువారం తెల్లవారుజామున నిర్వహించిన ఏసీబీ దాడుల్లో రూ 76 వేల నగదు తో పాటు ఎంబీఐ శేఖర్, డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు పశువులకు పాల్పడుతున్న మరో ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గరికపాడు చెక్పోస్ట్ వద్ద వాహనదారుల నుండి అనధికారిక వసూళ్లను ప్రైవేటు వ్యక్తులను నియమించి మరి వసూలు చేస్తున్నారని ఎప్పటినుంచో ఆరోపణలో ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు కొరడా జూలిపించారు.