Wednesday, November 20, 2024

శ్రీశైల దేవస్థానంలో ఏసీబీ విచారణ..

శ్రీశైలం, ప్రభన్యూస్‌ : శ్రీశైల దేవస్థానంలో జరిగిన అవినీతిపై ఏసీబీ అధికారులు రెండు రోజులుగా విచారణ చేపట్టారు. ఆర్జితసేవ టికెట్లు-, రూ.150ల దర్శనం, డొనేషన్‌ కౌంటర్‌లలో అవినీతి జరిగిందని గతంలోనే ఏసీబీ అధికారులు గుర్తించారు. రూ.2.50 కోట్లు స్వాహా చేశారని ఫిర్యాదులు అందటంతో ఆయా విభాగాల్లో విధులు నిర్వహించిన అధికారులన విచారించారు.

ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మంది శాశ్వత ఉద్యోగులను దేవాదాయ శాఖ కమిషనర్‌ సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక 20 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. విచారణ సమయంలో రూ.80 లక్షలను పోలీసులు రికవరీ చేశారు. తాజాగా మరో 8 మందిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. విచారణ లోతుగా చేస్తే మరికొంత మంది అవినీతి పరులు బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement