శ్రీశైల దేవస్థానం పరిధిలో మరో సారి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. రెండు రోజులుగా దేవస్థానం ఉద్యోగులను పిలిపించి ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆర్జితసేవ టికెట్లు, 150 రూపాయల దర్శనం, డోనేషన్ కౌంటర్ లల్లో అవినీతి జరిగింది అని గతంలోనే ఏసీబీ అధికారులు గుర్తించారు. గతంలో 2.50 కోట్ల రూపాయల అవినీతి జరిగిన విభాగాలల్లో విధులు నిర్వహించిన అధికారులను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మంది శాశ్వత ఉద్యోగులను దేవాదాయ శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. 20 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుండి తొలగించారు. విచారణ లోతుగా చేస్తే మరికొంత మంది అవినీతి పరులు బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. విచారణ సమయంలో 80 లక్షల రూపాయలను పోలీసులు రికవరీ చేసిన ఏసీబీ అధికారులు.. తాజాగా 8 మందిపై కేసులు నమోదు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement