Wednesday, November 20, 2024

లక్ష లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన సాలూరు క‌మిష‌న‌ర్

విజ‌య‌న‌గ‌రం : అవినీతి అధికారులపై ఏపీలో ఏసీబీ అధికారులు వరుస దాడులు కొనసాగిస్తున్నారు. నిన్న విద్యుత్‌ శాఖ ఏఈ, జూనియర్‌ అసిస్టెంట్‌ లంచం తీసుకుంటూ పట్టుబడగా మంగళవారం మన్యం జిల్లాలో మున్సిపల్‌ కమిషనర్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లాలోని సాలూర్‌ మున్సిపల్‌ పరిధిలో ఇంటి యజమాని ఒకరు భవన నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే అందుకు కావలసిన అనుమతులతోపాటు ఇంటి పన్ను విషయంలో సాలూరు మున్సిపల్‌ కమిషనర్‌ హెచ్‌.శంకర్రావును సంప్రదించాడు. అయితే కమిషనర్‌ రూ. 4 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ ఇంటి యజమాని రెండు లక్షలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు.

ఈ విష‌యాన్ని ఎసిబి అధికారుల‌కు అందించాడు ఆ య‌జ‌మాని.. దీంతో మంగళవారం రూ. లక్ష కమిషనర్‌కు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి కమిషనర్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశామని అధికారులు వివరించారు. ఆదాయా

నికి మించిన ఆస్తుల కేసులో గతంలో శంకర్రావు అవినీతి అధికారులకు పట్టుబడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement