ఆర్టీఓ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నరహరి పేట, పలమనేరు ఆర్టీఓ చెక్ పోస్ట్ లపై ఏకకాలంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తనిఖీల్లో నరహరి పేట చెక్ పోస్ట్ నందు 75 వేల రూపాయల నగదు అనధికారికంగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పలమనేరు చెక్ పోస్ట్ దాడులపై అధికారులను ప్రశ్నించగా ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. తమ పైస్థాయి అధికారులు పూర్తి వివరాలు వెల్లడిస్తారని తెలిపారు. గత కొంతకాలంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిన్న రాత్రి నుంచి పలమనేరు ఆర్టీవో చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం కలకలం రేపింది. పలమనేరు కేటిల్ ఫామ్ వద్దనున్న ఆర్టీవో చెక్ పోస్ట్ పై దాడులు చేశారు. ఈ దాడులు తిరుపతికి చెందిన ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital