Thursday, January 30, 2025

ABV | సస్పెండ్ కాలానికి జీతం ఇవ్వండి.. ప్రభుత్వం ఆదేశం

అమరావతి: విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) సస్పెన్షన్ కాలాన్ని ఏపీ ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. గతంలో జగన్ ప్రభుత్వం 2 దఫాలుగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

మొదటి దఫా 2020 ఫిబ్రవరి నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు.. రెండో విడతలో 2022 జూన్ 28 నుంచి 2024 మే 30 వరకు సస్పెన్షన్ విధించింది. తాజాగా ఆ కాలాన్ని విధులు నిర్వహించినట్లుగా క్రమబద్ధీకరిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement