చల్లపల్లి : ఎంతో చరిత్ర కలిగిన చల్లపల్లి శ్రీమంత్ రాజా హై స్కూల్ మూసివేస్తున్నట్లు తెలియడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. హైస్కూల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా పేద విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నారు. దీంతో ఘంటసాల మోపిదేవి చల్లపల్లి మండలాల్లోని పేద విద్యార్థులు ఇక్కడే చదువుకొని.. ప్రస్తుతం దేశ విదేశాల్లో వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. చరిత్ర కలిగిన హై స్కూల్ నూతన జీవో ప్రకారం మూసివేస్తున్నట్లు తెలియడంతో పేద విద్యార్థులను ఎక్కడ చేర్పించాలి అనే సందిగ్ధంలో ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.విద్యా సంవత్సరం చివరిలో పాఠశాల మూసివేస్తే విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు.. ప్రజా సంఘాల నాయకులు.. విద్యార్థి సంఘాలు.. పూర్వ విద్యార్థులు స్పందించి శ్రీమంతుడు రాజా హై స్కూల్ అక్కడే కొనసాగే విధంగా కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement