Friday, November 22, 2024

AP: నేటి నుంచి ఏపీలో ఆధార్ క్యాంపులు… అప్‌డేట్‌తో పాటు అన్ని ర‌కాల సేవ‌లు…

ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు ఏపీలో స్పెష‌ల్ ఆధార్ క్యాంపులు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు 100శాతం ఆధార్‌ డాక్యుమెంట్ అప్డేట్లను సాధించడానికి, ఫిబ్రవరి 20,21,22,23 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ క్యాంపులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఆధార్‌ అప్‌డేట్‌తో పాటు అన్ని రకాల సేవలు అందించనున్నట్టు తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

- Advertisement -

ఆధార్‌ తీసుకుని పదేళ్లయిన వారు కచ్చితంగా అప్డేట్‌ చేసుకోవాలని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గత ఆగస్టు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.49 కోట్ల మంది వివరాలను అప్‌డేట్‌ చేసుకోలేదు. సచివాలయ ఉద్యోగులు సచివాలయంలో అందుబాటులో ఉన్న అన్ని ఆధార్ సేవల గురించి తెలుపుతూ పబ్లిక్ అవేర్నెస్ కోసం మైకులు ఉపయోగించి లేదా చెత్త వ్యాన్ల ద్వారా లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రకటనలు చెయ్యాలని పేర్కొంది. యూఐడీఏఐ సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. పదేళ్లు అయినా ఒక్క సారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో 1.36 కోట్ల మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement