బైక్ పై వెళ్తున్న తనని వేధించిన యువకుడిని కర్రతో చితగ్గొట్టింది ఓ యువతి. ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా సమస్యను ఎదుర్కొంది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గన్నవరం ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న యువతి రాత్రి ఇంటికి వెళ్తుండగా ఓ వ్యక్తి బైక్ ఆపి వేధింపులకు పాల్పడ్డాడు. రాత్రి యువతి బైకుపై వెళ్తుండగా ఓ యువకుడు ఆమెను ఫాలో అవుతూ ఇబ్బంది పెట్టాడు. అయితే, అప్రమత్తమైన యువతి రోడ్డు పక్కన ఉన్న కర్ర తీసుకుని అతడిపై తిరగబడి కొట్టింది. నడిరోడ్డుపైనే ఆ యువకుడికి కర్రతో చితగ్గొట్టి బుద్ధి చెప్పింది. వేధింపులకు గురిచేసిన ఆ యువకుడిని కింద పడేసి ఆ యువతి కర్రతో కొడుతుండగా ఆ పోకిరీ భయంతో వణికిపోయాడు. పోకిరీలు ఇలా వేధింపులకు గురి చేస్తోంటే ఆడవాళ్లు బయట ఎలా తిరగగలుతారని ప్రశ్నిస్తూ యువతి అందరి ముందూ ఆ యువకుడిని చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోను ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఆ యువతిని ప్రశంసించారు.
గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ పోకిరి బైకును అడ్డగించి వేధింపులకు గురిచేశాడని ఆమె తెలిపారు. సదరు పోకిరిని యువతి కర్రతో చితకబాదిందని చెప్పారు. ఆ యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు పేర్కొన్నారు.
నడిరోడ్డుపై యువకుడిని కర్రతో చితగ్గొట్టిన యువతి
Advertisement
తాజా వార్తలు
Advertisement