Friday, November 22, 2024

AP | విద్యుత్ లేక , ఆక్సిజన్ అందక.. గూడూరు ఏరియా ఆస్ప‌త్రిలో యువతి మృతి 

గూడూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తిరుపతి జిల్లా  గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిట‌ల్‌లో చావు బతుకులతో వచ్చిన కొమ్మ సాయి నీలిమ (26) అనే యువతి  సకాలంలో ఆక్సిజన్ అందించలేక పోవడంతో చ‌నిపోయింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. యువతి తండ్రి కొమ్మ రవీంద్ర తెలిపిన వివరాల మేరకు.. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఏడేళ్ల నుండి సాయి నీలిమ ప్రభుత్వాసుపత్రిలోనే డయాలసిస్ చేయించుకుంటోంది.  ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో  నీలిమకు ఊపిరి ఆడటం కష్టంగా ఉందని చెప్పడంతో .. వెంటనే 20 నిముషాలలో గూడూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి యువతిని తరలించారు.

 

అప్పటికే ఆసుపత్రిలో ఉన్న నాలుగు ఆక్సిజన్ సిలిండర్లు ఖాళీగా ఉండగా.. ఒక చిన్న సిలిండర్ మాత్రం అందుబాటులో ఉందని నర్సులు తెలిపారు . ఆ సిలిండర్ తోనే నీలిమకు ఆక్సిజన్ అందించేందుకు యత్నించే సమయానికి కరెంట్ పోయింది..  ఇక‌.. జనరేటర్  ఉన్నా ఆ  ఆక్సిజన్ మిషన్ కు ఆ సదుపాయం లేక పోవడంతో ఆక్సిజన్ అందక తన కుమార్తె నీలిమ చనిపోయిందని, సరైన సమయానికి ఆక్సిజన్ అందించి వైద్య చికిత్స అందింయి ఎంటే కచ్చితంగా బతి్ఇ ఉండేదని రవీంద్ర విలపించారు. ఇదిలా ఉండగా.. దీనిపై స్పందించిన ఆస్ప‌త్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ కరెంట్ పోయిన మాట నిజమేనని, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసేలోగా  ఆ యువతి చనిపోయి ఉండవచ్చునని తెలిపారు . ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదని, కేవలం ఆ యువతి కండిషన్ బాగా లేక పోవడమే కారణమని భావిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement