Tuesday, November 26, 2024

KNL: భార్య కాపురానికి రాలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం

కోసిగి, జూన్7 (ప్రభ న్యూస్) : కట్టుకున్న భార్య కాపురానికి రావడం లేదని భర్త పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నంకు యత్నించిన సంఘటన బుధవారం కోసిగిలో చేటు చేసుకుంది. కోసిగి మండలం చిన్న బొంపల్లి గ్రామానికి చెందిన కామనదొడ్డి చిన్న అనుమంతు అనే యువకుడు కోసిగి గ్రామానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే గత 4 రోజులు క్రితం జరిగిన ఏరువాక పౌర్ణమి పండుగకు అమ్మాయి భర్త ఇంటి నుండి పుట్టినిల్లు అయిన కోసిగి రావడం జరిగింది. అయితే పండుగ ముగిసిపోయినప్పటికీ భార్య పిలిస్తే రావడం లేదని మనస్తాపానికి గురై కోసిగి తహశీల్దార్ కార్యాలయం సమీపంలో పురుగుల మందు సేవించి వెంటనే సెల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు కోసిగి ఆసుపత్రిలో చికిత్స చేయించి ఆదోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement