మూడేళ్ల మద్యం అమ్మకాలు, ఆదాయం, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… సారా మరణాలన్నీ జే-గ్యాంగ్ మద్యం మాఫియా హత్యలే అని ఆయన ఆరోపించారు. మూడేళ్లు పూర్తైనా తెలుగుదేశం ప్రభుత్వంపై పడి ఏడుపులు సిగ్గుచేటన్నారు. అప్పులు, వడ్డీలు, తాకట్టుల వివరాలు బయట పెట్టాలన్నారు. డిస్టిలరీలు, బ్రాండ్లు, టెండర్లు లేకుండా కొనుగోళ్లకు కారణాలు వెల్లడించాలని ఆయన అన్నారు. అప్పులు, అక్రమ కేసులతో రాష్ట్ర పరువు రోడ్డు పాలు అవుతోందని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవ గింజలంటే.. తాటికాయల్లా ఉంటాయన్నట్లు పెగాసెస్‌పై జే – గ్యాంగ్ తీరు ఉందని వ్యాఖ్యానించారు. పెగాసెస్ అనేది ఏంటో తెలియని వేలిముద్రగాళ్లు కూడా పెగాసెస్ పై వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అమరావతిలో అవినీతి, కోడికత్తి, బాబాయి గొడ్డలివేటు జాబితాలో.. నేడు పెగాసెస్ అని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital