కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. విభజన సమస్యల పరిష్కారం కోసీ ఈరోజు భేటీ అయింది. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల అధికారులతో ఉప సంఘం వర్చువల్‌గా సమావేశమైంది. ఈ సమావేశానికి ఏపీ నుంచి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన వివాదాలపై చర్చిస్తున్నారు. ప్రధానంగా ఐదు అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సివిల్ సప్లయ్ ఆర్థిక అంశాలు, పన్నుల విధానం, బ్యాంకు డిపాజిట్లు, నగదు పంపకాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital