Saturday, November 23, 2024

ఆయుర్వేద మందును ఎలా తయారు చేస్తున్నారు?

బొనిగి ఆనందయ్య తయారు చేసిన మందుని అన్ని విధాలుగా పరిశీలిస్తామని ఆయుష్ కమీషనర్ రాములు తెలిపారు. మందుకి చట్టబద్ధత కల్పిసే ఎక్కువ మందికి మందు కల్పించే అవకాశం ఉందన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆయుష్, ఐసీఎంఆర్ బృందాలు కృష్ణపట్నం చేరుకున్నాయి. ఆనందయ్య కరోనా ఆయుర్వేద మందుపై ఈ రెండు బృందాలు పరిశీలించాయి. కరోనాకు విరుగుడుగా ప్రచారం జరుగుతున్న ఆనందయ్య మందుపై ఈ రెండు బృందం అధ్యయనం చేస్తున్నాయి.

ఆనందయ్య తయారుచేసే వివిధ చెట్ల ఆకులు,  పదార్థాలను బృందం పరిశీలించింది. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయుర్వేద మందులో ఏమేమి వస్తువులు కలుపుతున్నారు? ఎలా తయారు చేస్తున్నారు ? అనే విషయాలను దగ్గరుండి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయుర్వేద మందు వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ? లేదా ? అనే విషయంపై ఐసీఎంఆర్ బృందం దృష్టి పెట్టింది. వైద్యం తీసుకున్న వారి దగ్గరికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు. నివేదిక రెండు మూడు రోజుల్లో సిద్ధం చేయనున్నారు. ఇప్పటివరకు ఒక నెగెటివ్ మార్కు కూడా లేదని, మొత్తం అంత పాజిటివ్  గానే ఉందని ఆయుష్ కమిషనర్ రాములు బృందం పేర్కొంది. త్వరగా నివేదిక వచ్చేలా చేస్తామని తెలిపింది.

కాగా, ఏపీలో కృష్ణపట్నం కరోనా మందు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న కరోనా మందు దివ్య ఔషధంలా పనిచేస్తోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరగడంతో కరోనా బాధితులు వేల సంఖ్యలో క్యూ కట్టారు. కోవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో లక్షలు ధారపోసినా ప్రయోజనం లేదని.. ఆనందయ్య కరోనా మందు తీసుకున్న గంటలు, రోజుల్లోనే నయమైపోయిందంటూ కొందరు రోగులు చెబుతున్న వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆనందయ్య మందుకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆయుర్వేద మందు కోసం నెల్లూరు జిల్లా నుంచే కాక ఏపీ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు.

ఇది కూడా చదవండి: కరోనాకు ఆయుర్వేద మందు దివ్య ఔషధం!

Advertisement

తాజా వార్తలు

Advertisement