Tuesday, November 26, 2024

మానసిక వికలాంగుడిపై టీచర్‌ దాష్టీకం.. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స

జమ్మలమడుగు అర్బన్‌, ప్రభ న్యూస్‌ తల్లిదండ్రుల ప్రేమ కరువైన ఒక మానసిక వికలాంగుడి పైన, తన కోపాన్ని చూపిస్తూ విచక్షణారహితంగా వైరుతో ఒళ్లంతా గాయాలపాలు చేసిన ఘటన జమ్మలమడుగు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా, జమ్మలమడుగు మండలం గూడెం చెరువుకు రాజీవ్‌ కాలనీకి చెందిన మానసిక వికలాంగుడైన వేణుగోపాల్‌ను గత పది సంవత్సరాల క్రితం తిరుపతి రేణిగుంట బ్రిడ్జి సమీపంలోని అభయ క్షేత్ర మానసిక వికలాంగుల స్వచ్ఛంద సంస్థలో అతని తండ్రి చేర్పించాడు. కాగా దీపావళి పండుగ సందర్భంగా అతడిని తన తల్లి ఇంటికి తీసుకొని రావడానికి అక్కడికి వెళ్ళింది, అయితే తన కొడుకు వేణుగోపాల్‌ ఒంటిపై ఉన్న గాయాలుండడాన్ని గమనించిన ఆమె ఎందుకు గాయాలయ్యాయని అడిగింది.. వాళ్లూ, వీళ్లు కలిసి కొట్టుకున్నారని ఆ సంస్థ నిర్వాహకులు బుకాయించారు తీరా తన కొడుకు చొక్కా విప్పి చూడగా, ఒళ్లంతా విచక్షణారహితంగా వైరుతో చితకబాదినట్లు తెలిసిందని అతని తల్లి తెలిపింది.

వేణుగోపాల్‌ జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అభం శుభం తెలియని తన బిడ్డను వైరుతో విచక్షణా రహితంగా కొట్టిన చరణ్‌ అనే ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు జమ్మలమడుగు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అభయ క్షేత్ర స్వచ్ఛంద సేవ సంస్థపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వేణుగోపాల్‌ తల్లి లక్ష్మీదేవి కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement