Friday, November 22, 2024

AP: పెట్టుబడుల ఆకర్షణకు పక్కా ప్రణాళిక.. విశాఖలో అంతర్జాతీయ సదస్సుకు సన్నాహాలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం పెట్టు-బడుల ఆకర్షణ దిశగా పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తుందని పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ వెల్లడించారు. ఇప్పటికే లోగోను రూపొందించి ముఖ్యమంత్రికి చూపిన నేపథ్యంలో తుది కసరత్తు జరుగుతుందని, త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో లోగో ఆవిష్కరణ జరుగుతుందని స్పష్టం చేశారు. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుపై బుధవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని ఎక్కువ పెట్టు-బడులను ఆకర్షించగలిగే రంగాలను ఎంచుకుని ఆయా రంగాలవారీగా పారిశ్రామికవేత్తలతో దక్షిణ కొరియా, తైవాన్‌, జపాన్‌ , బ్రిటన్‌, అమెరికా, న్యూజిలాండ్‌ దేశాల్లో రౌండ్‌ టేబుల్‌, రోడ్‌ షోలు నిర్వహించేలా దిశా నిర్దేశం చేశారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాయబారులు హాజరయ్యే ఈ సమావేశాల్లో అధికారుల బృందం ఏపీలో పెట్టు-బడుల అవకాశాలను వివరించనున్నట్లు- పేర్కొన్నారు. విశాఖ పెట్టు-బడుల సదస్సు నిర్వహణ బాధ్యతలను కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్ర్‌ కు అప్పగించిన నేపథ్యంలో ఆ ప్రతినిధులతో రోడ్‌ షోలను ఎలా ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మంత్రి సమాలోచనలు జరిపారు. విద్యుత్‌, ఐ.టీ, ఎలక్ట్రాన్రిక్స్‌, మెరైన్‌, మౌలికవసతులు, పోర్టులు, విమానయాన, డిఫెన్స్‌, నైపుణ్య రంగాలకు సంబంధించిన రోడ్‌ షోల ప్రణాళిక పూర్తయిన నేపథ్యంలో రానున్న 3 నెలల్లో వాటిని పూర్తి చేసే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.

పనుల్లో మరింత వేగం పెంచాలి..
ఏపీఐఐసీ ప్రాజెక్టుల పనుల్లో మరింత వేగం పెంచాలని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్‌ సూచించారు. ఏపీఐఐసీ ల్యాండ్‌ బ్యాంక్‌, భూ కేటాయింపులు, ఎలక్ట్రాన్రిక్‌ మ్యానుఫాక్చరింగ్‌ క్లస్టర్ల పురోగతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామిక పార్కుల్లో భూముల కేటాయింపు విధానంపై ఆరా తీశారు. 2019 నుంచి నేటి వరకూ 2,450 యూనిట్లకు 4,664 ఎకరాల భూమిని కేటాయించినట్లు- ఏపీఐఐసీ వీసీ, ఎండీ మంత్రికి వివరించారు. ఇప్పటికే వాటిలో 64 పరిశ్రమలు ఉత్పత్తి దశలోకి వెళ్లాయన్నారు. మరో 10 యూనిట్లు టైల్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నాయన్నారు.

2022-23 ఏడాదికి గానూ రూ.330 కోట్ల ఆదాయం సంపాందించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు- పేర్కొన్నారు. ఈఎంసీలు సహా రాష్ట్రవ్యాప్తంగా ముందుకు సాగుతున్న రూ.1934 కోట్ల విలువైన 61 ఇంజనీరింగ్‌ పనుల పురోగతిని ఎండీ భరత్‌ గుప్తా మంత్రికి వివరించారు. అందులో భాగంగా ఇప్పటివరకూ రూ.751.78 కోట్ల పనులు పూర్తి చేసినట్లు- తెలిపారు. ఈ సమీక్షలో కు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి.సృజన, ఏపీఈడీబీ సీఈవో , ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, పరిశ్రమల శాఖ జాయింట్‌ డైరెక్టర్లు ఇందిరా, పద్మావతి, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సుదర్శన్‌ బాబు, రాజేంద్రప్రసాద్‌, ఇతరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement