Friday, November 22, 2024

AP: చిన్న మొత్త‌మే… అయినా వారి జీవితాల‌కు గోరంత దీపం – జ‌గ‌న్…

తాడేప‌ల్లి – జగనన్న తోడు నిధులు నేడు విడుదలయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక్కొక్కరికి 10 వేల రూపాయల రుణం అందించారు సీఎం జగన్‌. నిధుల‌ను బ‌ట‌న్ నొక్కి ల‌బ్దిదారుల ఖాతాలో జ‌మ చేశారు జ‌గ‌న్.. దీని వ‌ల్ల 3,95,000 చిరు వ్యాపారులకు లబ్ది చేకూరింది.

ఈ సందర్బంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ….దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం అని కొనియాడారు. పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ల బతుకులు ఎలా ఉంటాయనేది మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నా వాళ్ల బతుకులు ఎలా మార్చాలి, వీళ్లకు డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలంటే వీళ్లు పడుతున్న కష్టాలేమిటి అని బహుశా ఎప్పుడూ ఎవరూ ఇంత ఆలోచన చేయలేదని వెల్లడించారు. నా కళ్ల ఎదుట కనిపించినప్పుడు, దాదాపు నా పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులుగానీ, ప్రతి జిల్లాలోనూ ఇది కనిపించేదని పేర్కొన్నారు సీఎం. వారి క‌ష్టాలు ప్ర‌త్య‌క్ష్యంగా చూడ‌టం వ‌ల్లే ఈ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టాను.. ఇచ్చేది చిన్న మొత్త‌మే అయినా వారి జీవితాల‌కు ఇది గోరంత దీప‌మ‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు..

నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కు­కొనేలా రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జగనన్న తోడు పథకం దేశానికే దిక్సూచిగా నిలిచింద‌ని సీఎం పేర్కొన్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నామ‌ని, రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నామ‌న్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో జీవిస్తూ, మరో ఒకరిద్దరికి సైతం ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడకుండా వారికి ప్ర‌భుత్వం అండగా నిలుస్తోంద‌ని చెప్పారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభు­త్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు, అంతకుపైన రూ. 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు అందిస్తున్నామ‌ని చెప్పారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement