Tuesday, November 26, 2024

మాతృభాషలో వాదనలు తప్పేమీకాదు.. ఓ కేసు విచారణలో తెలుగులో మాట్లాడిన న్యాయవాదిపై ఆగ్రహించిన సింగిల్‌ జడ్జి

మాతృభాషలో వాదనలు వినిపించటం కోర్టును అవమానపరచటం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఓ కేసు విచారణ సందర్భంగా న్యాయవాదిని ఆంగ్లంలో న్యాయమూర్తి ప్రశ్నించారు. స్పందించిన న్యాయవాది తెలుగులో సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహించిన న్యాయమూర్తి తెలుగులో మాట్లాడి కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించారని ఇందుకు గాను ఖర్చుల కింద రూ. 25వేలు చెల్లించాలని హుకుం జారీ చేశారు. దీన్ని సవాల్‌ చేస్తూ న్యాయవాది ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం మాతృభాషలో వాదించడం సక్రమమే అని సమర్ధించింది. ఇది కోర్టును అవమా నించినట్లు ఎంతమాత్రం కాదని తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలి లా ఉన్నాయి. విశాఖపట్నంలో ఓ భవన నిర్మాణ అనుమతులపై అగనంపూడికి చెం దిన గురు భాస్కర్‌రావు 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సింగి ల్‌ జడ్జి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ అర్హతపై న్యాయమూర్తి ప్రశ్నించారు.

అప్పటి వరకు ఆంగ్లంలో వాదనలు వినిపించిన పిటిషనర్‌ తరుపు న్యాయ వాది తెలుగులో స్పందిస్తూ తమరు 18, 19 పేజీ సనెంబర్లలో పరిశీలించాలని కోరారు. ఇందుకు ఆగ్రహించిన న్యాయమూర్తి కేసు పూర్వాపరాల్లోకి వెళ్లకుండానే పిటిషన్‌ను కొట్టేశారు. తెలుగులో మాట్లాడి కోర్టును అవమానపరిచారని మండిపడ్డారు. దీంతో న్యాయవాది క్షమాపణలు కోరారు. తెలుగులో మాట్లాడిన మాటలు పరిగణనలోకి తీసుకోరాదని అభ్యర్థిస్తూ తిరిగి ఇంగ్లీష్‌లో సమాధానమి చ్చారు. అయితే న్యాయమూర్తి అంగీకరించలేదు. పిటిషన్‌ను సాదాసీదాగా వేశారని వాదనలు కూడా అదే స్థాయిలో వినిపించినందున పిటిషన్‌ను కొట్టేస్తూ పిటిషనర్‌కు రూ. 25వేల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించారు. దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషనర్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. ఈ అప్పీల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమా ర్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మా సనం విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరుపున న్యాయవాది వాదిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొనసాగించే ఉద్దేశం తమకులేదని చెప్తూ సింగిల్‌ జడ్జి ఖర్చుల కింది పిటిషనర్‌కు రూ. 25వలు చెల్లించాలని జారీచేసిన సింగిల్‌ జడ్జి ఉత్తర్వులే అభ్యంతరకరమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్పందించిన ధర్మాసనం జరిమాన ఎందుకు విధించా రని ప్రశ్నించారు. తెలుగులో సమాధానం చెప్పినందుకని న్యాయవాది బదులిచ్చా రు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. హైకోర్టులో కార్యకలా పాలు జరిగే భాష ఇంగ్లీష్‌ అయితే మాతృభాష, ప్రాంతీయ భాషలో వాదనలు వినిపించటం కోర్టు ప్రొసీడింగ్స్‌ను అవమానించినట్లు కాదని స్పష్టం చేశారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దుచేస్తూ కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి తేల్చాలని కోరటంలేదని పిటిషనర్‌ కోరనందున మూలాల్లోకి వెళ్లటంలేదని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement