ఏపీలోని గుంటూరు జిల్లాలో యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్న బస్సును స్కూటీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరుకు చెందిన తల్లి కూతుళ్లు నాగలక్షి, కుమార్తె సాయిలక్షి చిలకలూరిపేట వైపు నుంచి వెళ్తున్నారు. ఎడ్లపాడు నక్కవాగు సమీపంలో వసంత నూనె మిల్లుకు చెందిన కార్మికులను తీసుకెళ్తున్న బస్సు ఆగి ఉంది. నక్కవాగు సమీపంలోని సుబాబుల్ తోట వద్ద హైవేపై బస్సును ఆపి డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు.
అదే మార్గంలో స్కూటీపై వెళ్తున్న తల్లికూతుళ్లు బస్సును ఢీకొట్టారు. బస్సు సమీపంలోకి రాగానే రోడ్డుపై దిష్టి కొబ్బరికాయ ఉండడం గమనించారు. దాంతో స్కూటీని సైడు నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించే క్రమంలో అదుపుతప్పి ఆగి ఉన్న నూలు బస్సు వెనుక భాగంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సాయి లక్ష్మి అక్కడికక్కడే చనిపో
యింది. నాగలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహన సిబ్బంది నాగలక్ష్మిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.