Sunday, November 17, 2024

AP | విశాఖలో వెనక్కు మళ్లిన సముద్రం

విశాఖపట్నం, ఆంధ్రప్రభ: జపాన్‌లో భారీ భూకంపం ప్రభావమో.. అమావాస్య, పౌర్ణమి సమయాల్లో కలిగే వాతావరణ ప్రభావమో తెలియదు గానీ విశాఖలో గత రెండు రోజులుగా సముద్రం కాస్త వెనక్కు మళ్లింది. ఇదే సమయంలో నూతన సంవత్సర వేడుకలు కూడా కలిసి రావడంతో విశాఖ బీచ్‌కు సందర్శకులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి విశాఖలో గడిపేందుకు పర్యాటకులు భారీ ఎత్తున రాగా, ఎక్కువసేపు ఇక్కడ ఉన్నారు. నగర వాసులు కూడా జతకలడంతో బీచ్‌ ప్రాంతాలు కిటకిటలాడాయి. అయితే దేశంలోనే సముద్రం దగ్గరకు ఉండే బీచ్‌గా గుర్తింపు పొందిన విశాఖ ఆర్కే బీచ్‌ ఒక్కసారిగా వెనక్కి వెళ్లినట్టుగా కనిపించడం ఆందరినీ ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement