ఎవరికైనా చదువే నిజమైన ఆస్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అమ్మ ఒడి మూడో విడత కింద తల్లుల ఖాతాల్లో రూ.6595కోట్లు జమ చేశారు. ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు అమ్మ ఒడి కింద రూ.19,618కోట్లు జమ చేశామన్నారు.
ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందన్నారు. పిల్లల్ని బాగా చదివిస్తే వారి జీవితాలు మారుతాయన్నారు. అందుకే 75శాతం హాజరు ఉండాలనే నిబంధన తెచ్చామన్నారు. చదువు మీద ఖర్చు చేసే ప్రతి పైసా గొప్ప పెట్టుబడి అన్నారు. విద్యారంగంలో మూడేళ్లలో సమూల మార్పులు తెచ్చామన్నారు.
- Advertisement -