Saturday, November 30, 2024

APSRTC | డ్రైవర్ తప్పిదంతో ముగిసిన మెకానిక్ జీవితం

నంద్యాల బ్యూరో, నవంబర్ 30 : నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ అద్దె బస్సులో ప్రైవేట్ మెకానిక్ చిన్న వెంకట రమణారావు అలియాస్ గణపతి రిపేరు చేసేవాడు. శనివారం బస్సు కింద రిపేరు చేస్తుండగా డ్రైవర్ చూసుకోకుండా బస్సును ముందుకు నడిపించాడు.

దీంతో బస్సు కింద రిపేరు చేస్తున్న రమణారావు తలపై బస్సు చక్రాలు పోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువులు, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. భార్యా పిల్లల రోధన చూప‌రుల‌కు కంటతడి తెప్పిస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement