Friday, December 13, 2024

కనికరించండి మహా ప్రభో.. వృద్దురాలి స్థలాన్ని కబ్జా చేసిన ఘనుడు

  • ఎన్ని ఫిర్యాదులు చేసిన కదలని రెవిన్యూ యంత్రాంగం…
  • భారీగానే ముడుపులు అందయంటూ విమర్శలు…

గాజువాక, (ఆంధ్రప్రభ ) : కష్టారజితంతో రూపాయి రూపాయి పోగేసి 12ఏళ్ళ క్రితం ఓ గుతేదారుడి దగ్గర స్థలాన్ని కొనుగోలు చేసిన వృద్దురాలు మడక అప్పలనర్సమ్మ భూమిని ఓ ఘ‌నుడు క‌బ్జా చేశాడు. 72ఏళ్ళ మడక అప్పలనర్సమ్మ ఆరోగ్యం బాగోలేక చిన్న కొడుకు ఇంటికి వెళ్లిపోవడంతో ఇదే అదును చూసుకొని ఆ వ్య‌క్తి ఆమె స్థలాన్ని కబ్జా చేసి తన నిర్మాణంలో కలిపేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న వృద్దురాలు అడగడానికి వెళ్తే నేను స్థలాన్ని ఇవ్వను మీరు నన్ను ఏమీ చెయ్యలేరు అంటూ దౌర్జన్యంకి దిగాడని తన స్థలాన్ని తనకు అప్పగించాలని నేటికి అధికారులు చుట్టూ తిరుగుతూనే ఉంది. కనికరించండి మహా ప్రభో అంటూ కనిపించిన అధికారులను నిస్సహాయ స్థితిలో వేడుకుంటుంది. అయితే ఎన్ని సార్లు ఫిర్యాదులు ఇచ్చిన అధికారులు మాత్రం చర్యలు తీసుకుంటాం అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప తనకు న్యాయం చెయ్యడం లేదని ఆ వృద్దురాలు ఆవేదన చెందుతుంది.

ఆ వృద్దురాలిని చూసిన వారంతా అధికారులు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీగా ముడుపులు అందాయి అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు విచారణ చేసి ఆ వృద్దురాలికి న్యాయం చెయ్యాలని లేని పక్షంలో సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దృష్టికి సమస్య ని తీసుకెళ్తామని స్థానిక పెద్దలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement