అల్పపీడనం ప్రభావంతో ఏర్పడ్డ తుపాను మరో గంటలో తీరం దాటనుంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాన నీటి వరదలతో నదులు, వాగులు ఉధృక్తంగా మారాయి. నెల్లూరు, చిత్తురు, ప్రకాశం, కడప జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
చిత్తూరు జిల్లా తూలిపాలెం దగ్గర 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా కురుస్తున్న వానలతో పంటపొలాలు చాలామటుకు నేలకోరిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily