Wednesday, December 18, 2024

KNL | ఆటోను ఢీకొన్న లారీ.. పలువురు విద్యార్థులకు గాయాలు

ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కర్నూలు జిల్లా ( ఓర్వకల్లు) : ఆటోను లారీ ఢీకొన‌డంతో ప‌లువురు విద్యార్థుల‌కు గాయాలైన ఘ‌ట‌న కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఓర్వకల్లు మోడల్ స్కూల్ లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఆటోలో స్కూల్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

రోజూ మాదిరిగానే విద్యార్థులు ఓర్వకల్ నుంచి ఆటోలో వెళుతుండగా జాతీయ రహదారిపై పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో లారీ ఆటోను ఢీకొనడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement