ఇచ్ఛాపురం, ( ఆంధ్రప్రభ ): స్కూటీని లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బలరాం పేటకు చెందిన ఉయ్యాల వంశీకృష్ణ (24) తన సోదరి ప్రసవం సమీపిస్తుండటంతో తన బావని ఇంటికి తీసుకురావడానికి బరంపురం సమీపంలోని హలిదేపద్ర వెళ్లాడు.
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తిరిగి వస్తుండగా ఎల్ మ్యాక్స్ థియేటర్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. వంశీ అక్కడికక్కడే మృతి చెందగా, బావ కృష్ణ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. వారిద్దరూ ఒకే కుటుంబంలో బావ, బావమరిది కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.