పలమనేరు, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ ) : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో గత వారం రోజులుగా ఒంటరి ఏనుగు రైతులకు కునుకులేకుండా చేస్తోంది. గత రాత్రి గంటవూరు జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వడ్ల గోడౌను వద్ద హల్చల్ చేసింది. ఆ ఏనుగు గత వారం రోజుల నుంచి మొగిలి, గౌరీశంకరపురం, మొగలివారిపల్లి, టేకుమంద మామిడికుంట గ్రామాల్లో రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఆ ఏనుగును అడవుల్లోకి తరమడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఆ ఏనుగు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు అంటున్నారు. కానీ ఏ క్షణంలో ఆ ఏనుగు ఏం చేస్తుందో అని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లపై, పంట పొలాలపై దాడులను చేస్తున్న ఏనుగుల నుంచి రక్షణ కల్పించాలని రైతులు కోరుతున్నారు.
- Advertisement -