అవుకు రూరల్, ప్రభన్యూస్ : జిల్లాలోని అవుకు మండలం రామవరం గ్రామ పరిసర ప్రాంతాల్లోని అవుకు టన్నెల్ సమీపంలో గల అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులుల సంచారం కలకలం రేపింది. రిజర్వాయర్ సొరంగం పనుల్లో చేస్తున్న కూలీలకు చిరుతపులులు కనిపించాయి. గమనించిన టిప్పర్ డ్రైవర్ వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
చిరుత పులులు సంచరిస్తున్నాయన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, మహిళా కూలీలు పొలం పనులకు వెళ్లాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని రామవరం, మెట్టు-పల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..