ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు.. పిఠాపురం ప్రజల కల నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేస్తూ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పిఠాపురం ఆసుపత్రిలో సౌకర్యాల కల్పన, వసతుల పెంపు కోసం రూ.38.32 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది.
పెంచిన పడకలకు అవసరమైన ప్రత్యేక భవనాలు, ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, కావలసిన ప్రత్యేకమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వెచ్చిస్తారు. ఆసుపత్రిలో పెరిగిన సామర్థ్యానికి అనుగుణంగా 66 మంది అదనపు వైద్య సిబ్బందిని నియమించనున్నారు.