Monday, September 16, 2024

AP | బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

గంగవరం, (చిత్తూరు) ప్రభ న్యూస్‌: గంగవరం సమీపంలోని మరేడుపల్లె వద్దనున్న ఓ నాటు బాణాసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు ఏర్పడిన పేలుడు కారణంగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రేలుడుకు ఇంటి పైకప్పులతో బాటు గోడలు సైతం పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ఆ శిథిలాల మధ్యలో మరో మహిళ చిక్కుకున్నట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న పోలీసు అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తులను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మంటలను అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది కూడా పాల్గొన్నారని తెలిసింది. ఈ ప్రమాదానికి కారణం తదితర వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సివుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement