Saturday, December 28, 2024

AP | బాలికపై పాస్టర్ అత్యాచారం..

ఇబ్రహీంపట్నం, (ఆంధ్రప్రభ): బాలికపై పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కొండపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం కొండపల్లికి చెందిన బాలిక (14)పై పాల్వంచకు చెందిన మేనమామ వరుస అయిన పాస్టర్ (40) పలుమార్లు కొండపల్లి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు.

దీంతో బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement