Friday, November 22, 2024

కొడుకు కోసం ఓ తండ్రి ఆవేదన.. ప‌ట్టించుకుంట‌లేడ‌ని వాల్ పోస్టర్లు

అనంతపురం: తాము ఎట్లాగూ చదువుకోలేదని.. తమ కొడుకుకి ఎటువంటి బాధలు ఉండకూడదు అంటూ రెక్కల కష్టం చేసి చదివించినా.. కుమారుడు ప్రయోజకుడై ముసలి ముప్పున ఆదుకుంటాడని ఆ తల్లిదండ్రులు భావించారు. కష్టపడి చదివిన చదువుకు సార్థకత చేకూరుతుంది. కుమారుడు అనుకున్నట్లుగానే గవర్నమెంట్ ఉద్యోగం పొంది, గ్రామంలోనే పిఈటిగా స్థానిక కంబదూరు పాఠశాలలో జాబ్ చేస్తున్నాడు. తమను బాగా చూసుకుంటాడని భావించారు ఆ త‌ల్లిదండ్రులు. అతను బాగోగులు చూడకుండానే తల్లి తనువు చాలించింది. తండ్రి ఉన్న పొలంలో సేద్యం చేసి వచ్చిన ఆదాయాన్ని కూడా కుమారుడికి ఇస్తూ వచ్చాడు. ఆయన అనంతపురంలో ఫ్యామిలీ పెట్టి ప్రతి రోజు పాఠశాలకు వచ్చి పోతుంటారు.

ఈ మధ్యన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఎటువంటి పనులు చేసుకోలేక ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో తన కుమారుడు ఆదుకుంటాడని భావించారు. అయితే తండ్రి బాగోగులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో.. తన ఆవేదనను పోస్టర్ రూపంలో తయారుచేయించి, కుమారుడితో పాటు తన ఫొటోను అందులో ముద్రించారు. తండ్రి ఆవేదన అంటూ పోస్టర్ను పాఠశాల గోడకు అతికించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అనంతపురం జిల్లా పేరూరు మండలం రాచర్ల వన్నూరప్ప అనే పెద్దాయన.. తన కుమారుడు అక్కులప్ప ను బాగా చదివించారు. 20 సంవత్సరాల క్రితం ఉద్యోగం కూడా వచ్చింది. అనంతపురంలో నివాసముండి.. పేరూరు కి రాకుండా ముఖం చాటేశాడు.తన భార్య చనిపోయి, తాను లేవలేని స్థితిలో ఉన్న పట్టించుకోలేదని తండ్రి ఆవేదన చెందుతున్నారు. ఆస్తులు పంచాలని బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. ప్రస్తుతం ఆయన వేసిన వాల్పోస్టర్ చూసి విద్యార్థులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement