Wednesday, December 18, 2024

AP | తల్లి తిడుతుందని ఇంటి నుండి పారిపోయిన చిన్నారి..

(ఆంధ్రప్రభ, విజయవాడ) : ఇంట్లో తల్లి మందలించి, హాస్టల్లో జాయిన్ చేస్తానని హెచ్చరించడంతో భయభ్రాంతులకు గురైన ఓ చిన్నారి ఇంటి నుండి చెప్పకుండా వెళ్లి, కిడ్నాప్ డ్రామా ఆడడం, కలుగజేసుకున్న పోలీసులు సర్ది చెప్పడంతో తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంది.

గుంటూరులోని వెంగళరావు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో 5 తరగతి చదువుతున్న చిన్నారి ఆదివారం రాత్రి ఇంటి పక్కన వాళ్లతో గొడవ జరిగితే తన తల్లి రేన మందలించింది. నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నిన్ను హాస్టల్ లో జాయిన్ చేస్తానని తల్లి హెచ్చరించడంతో భయపడిపోయిన చిన్నారి పాఠశాలకు వెళ్లకుండా ఒంట్లో బాగోలేదని చెప్పి ఇంట్లోనే ఉన్నది.

తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లి నేపథ్యంలో ఇంటి నుండి బయటకు వచ్చి విజయవాడలోని పిన్ని ఇంటికి వెళ్దామని గుంటూరులో కారు లిఫ్ట్ అడిగి విజయవాడ వారధి వద్దకు కారులో చేరుకుంది. అక్కడ నుండి బస్టాండ్ వరకు నడుచుకుంటూ చేరుకున్న చిన్నారిని గుర్తించిన పోలీసులు జరిగిన వాస్తవాన్ని అడిగి తెలుసుకున్నారు.

అయితే అప్పటికే తన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకు వచ్చారని, మొదట స్టోరీ చెప్పిన చిన్నారి తరువాత పోలీసులు సర్ది చెప్పడంతో అసలు విషయం చెప్పింది. దీంతో కృష్ణలంక పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం అందించి క్షేమంగా వాళ్ళ ఇంటికి చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement