శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి బిడ్డిక రశ్మిత (8) మలేరియా వ్యాధితో రిమ్స్ లో చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. పాఠశాలలో రశ్మితకి జ్వరం రావడంతో సరుబుజ్జిలి పీహెచ్సీ వైద్యులు చికిత్స చేశారు.
వైద్యుల సలహా మేరకు ఈనెల 5న మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలించగా, చికిత్స పొందుతూ బాలిక మృతిచెందినట్లు హెచ్ఎం ఉమా తెలిపారు. పాఠశాలను డీఎం అండ్ హెచ్ఓ బొడ్డేపల్లి మీనాక్షి సందర్శించారు. మరో ముగ్గురు విద్యార్థులకు మలేరియా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
- Advertisement -