Sunday, June 30, 2024

AP: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ స‌త్యానారాయ‌ణ‌పై కేసు న‌మోదు..

విశాఖపట్నం: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కేసు నమోదైంది. ఆయనతో పాటు ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్‌ గద్దె బ్రహ్మాజీపైనా విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవోయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్‌స్ట్రక్షన్‌ అధినేత జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. దీంతో ఈనెల 22న పోలీసులు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎంవీవీ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement