Sunday, December 1, 2024

AP: లారీని ఢీకొన్న కారు.. ఇద్ద‌రు యువ‌కులు మృతి..

విజయనగరం, సెప్టెంబర్ 17(ప్రభ న్యూస్) : ఆగి ఉన్న లారీని కారు ఢీకొన‌డంతో ఇద్ద‌రు యువ‌కులు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని డెంకాడ మండలం మోదవలస గ్రామంలో 26వ జాతీయ రహదారిపై ఇవాళ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో విజయనగరానికి చెందిన నమ్మి మనోజ్, తగరపువలసకు చెందిన శ్యాం కుమార్ ఉన్నారు. డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement